Pratap Pothen: మరణానికి ముందు నటుడి వింత పోస్టులు.. సోషల్ మీడియాలో వైరల్..

Pratap Pothen: ఇటీవల సినీ పరిశ్రమలో ఎన్నో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రఖ్యాత నటుడు మరియు చిత్రనిర్మాత అయిన ప్రతాప్ పోతన్ గుండెపోటుతో మరణించడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన మరణానికి కొన్ని గంటల ముందు పెట్టిన పోస్టులు చూస్తుంటే ఆయన చనిపోతున్నట్టు ముందుగానే పసిగట్టారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది.
గురువారం అర్థరాత్రి ప్రతాప్ గుండెపోటుతో మరణించారు. అయితే గురువారం మొత్తం ఆయన సోషల్ మీడియాలో ఎన్నో విచిత్రమైన పోస్టులు పెడుతూ వచ్చారు. ముందుగా 'చాలా కాలంపాటు కొంచెంకొంచెంగా లాలాజలం మింగడం వల్ల మరణం సంభవిస్తుంది' అని జార్జ్ కార్లిన్ రాసిన కోట్‌ను షేర్ చేశారు ప్రతాప్. 'సమస్య మూలం ఏంటో తెలియకుండా కేవలం లక్షణాలు చూసి ట్రీట్‌మెంట్ మొదలుపెడితే.. అప్పుడే నువ్వు పూర్తిగా ఫార్మసీ మీద ఆధారపడాల్సి ఉంటుంది' అని సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు.
ఆ తర్వాత కాసేపటికే 'జీవితం అంటే బిల్లులు కట్టడం' అనే కోట్‌ను షేర్ చేశారు ప్రతాప్. 'జీవితం అనే ఆటలో ప్రతీ జనరేషన్ ఒకేలా ఆడుతుంది' అని మరో పోస్ట్. 'నేను కళల్లో గుర్తింపు ఉందనుకున్నాను. ఇంకా చెప్పాలంటే చలనచిత్రాల్లో ఉందనుకున్నాను. కానీ ప్రజలు తమకు నచ్చినవాటిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చివరిగా పోస్ట్ చేసి.. ఈ కోట్స్‌కు ఎండ్ కార్డ్ వేశారు. కానీ ఉన్నట్టుండి ప్రతాప్ పూర్తిగా ఇలాంటి కోట్స్ షేర్ చేయడం.. అది కూడా తన మరణానికి కొన్ని గంటల ముందే ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com