Priyanka Chopra: అందుకే సరోగసి..!

Priyanka Chopra: అందుకే సరోగసి..!
X
మాల్టీ మారీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రియాంకా చోప్రా..

సెలబ్రిటీలు సరోగసి పద్దతిలో పిల్లల్ని కనడం సాధారణంగా మారింది. కొందరు సౌందర్యాన్ని కోల్పోతామని, మరి కొందరు ఆరోగ్య పరిస్థితుల సహకరించక ఈ పద్దతిని ఎంచుకుంటున్నారు. పిల్లల కోసం సరోగసిని ఆశ్రయించిన వారిలో ప్రియాంకా చోప్రా కూడా ఒకరు. ఆమె నిక్‌ జోనస్‌తో కలిసి సంవత్సరం క్రితమే సరోగసి పద్దతి ద్వారా ఓ పాపకు తల్లైంది. ఈ విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.


తమ బిడ్డ నెలలు నిండక ముందే జన్మించిందని, అందుకే తమ చిన్నారిని గాసిప్స్‌కు దూరంగా ఉంచేందుకే గట్టిగా పోరాడానని బ్రిటీష్‌ వోగ్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రజలు తనను ట్రోల్ చేసినా భరించగలిగానని కానీ తమ కూతురిని ఇందులోకి లాగటం చాలా బాధించిందని, వాటి నుంచి మాల్టీని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.


మాల్టీ పుట్టినప్పుడు ప్రియాంక చేతంత కూడా లేదని చాలా చిన్నగా ఉందని గుర్తు చేసుకుంది. చిన్నగా ఉన్న పాపను ఇంకుబ్యేటర్‌లో ఉంచినప్పుడు డాక్టర్లు, నర్సులే ఆమె పట్ల దైవంగా వ్యవహరించారని తెలిపింది. సరోగసి ద్వారా తల్లి అయ్యే ప్రక్రియపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని ప్రియాంకా వెల్లడించింది. అయితే తన అనారోగ్య సమస్యల కారణంగా సహజసిద్ధంగా తల్లిని కాలేనని స్పష్టం చేసింది. ఇంతకు మించి తన ఆరోగ్య పరిస్థితులను వివరించాల్సిన అవసరం లేదని పేర్కొంది.



Tags

Next Story