Project K: అమ్మడికి రూ. పది కోట్లు సమర్పయామీ....
బాలీవుడ్ లీడింగ్ లేడీ దీపికా పదుకోనే టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే లో అమ్మడు ఓ పవర్ ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతోంది. ఇటీవలే దీపిక పుట్టిన రోజు పురస్కరించుకుని సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం దీపిక భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటోందని తెలుస్తోంది. అమ్మడికి అచ్చంగా రూ. 10 కోట్లు సమర్పించుకుంటున్నారట చిత్ర బృందం. అయితే అమ్మడి రేంజ్ కు ఇది పెద్ద మ్యాటర్ కాదనే వారు కూడా ఉన్నారు. ఇదే సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ కు రూ. 100 కోట్లు అందుతన్నాయన్నాయట. మరి దాంతో పోల్చుకుంటే దీపికకు తీరని అన్యాయం జరిగినట్లే...! ఏమైనా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో బిగ్ బీ అమితాబ్ గాయాల పాలవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆయన కోలుకున్నాక ప్రాజెక్ట్ కే తిరిగి పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com