Project K: ప్రాజెక్ట్‌ కే అసలు టైటిల్‌ ఏంటంటే... అదిరిపోయిన సీన్స్‌

Project K: ప్రాజెక్ట్‌ కే అసలు టైటిల్‌ ఏంటంటే... అదిరిపోయిన సీన్స్‌
అదిరిపోయిన ప్రాజెక్ట్‌ కే గ్లింప్స్‌.. హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గని సీన్స్‌.... అదిరిపోయిన ప్రభాస్‌ లుక్‌

ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రాజెక్ట్‌ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికేసింది. ప్రపంచ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ కె (Project K) టైటిల్‌, గ్లింప్స్‌ వచ్చేశాయి. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఎన్నో రోజుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్‌ వేడుకల్లో ప్రాజెక్ట్‌ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేశారు.


ప్రాజెక్ట్‌ కె గ్లింప్స్‌ మాత్రం అదిరిపోయింది. ఫ్యాన్స్‌ను నాగ్‌ అశ్విన్‌ ఏమాత్రం నిరాశపరచలేదు. అద్భుతంగా కల్కిని క్రియేట్‌ చేశారు. సంతోశ్‌ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. ఇందులో విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయింది. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక శాన్‌ డియాగో కామిక్ కాన్‌ వేడుకలో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ప్రభాస్‌ (Prabhas), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), నిర్మాత అశ్వనీదత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. వీరితోపాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) కూడా వెళ్లారు.


ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది’ అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కె’ అనే ఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయింది.

మొత్తం 75 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్‌లో కేవలం ఒకే ఒక్క డైలాగ్‌ ఉంది. వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కే అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. ఇందులోని యాక్షన్స్‌ సీన్స్‌, విజువల్స్‌ అందర్నీ కట్టిపడేసేలా ఉన్నాయి. మొత్తంగా హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్న గ్లింప్స్‌ చూస్తుంటే గూస్‌బంప్స్‌ వచ్చేస్తున్నాయి. బాహుబలి సినిమాతో తొలి పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌.. ఈ సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ కావడం పక్కా అని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.


అవెంజర్స్’ తరహాలో.. ఫస్ట్ టైమ్ ఒక భారతీయ హీరో సూపర్ హీరో అవతారంలో.. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్లుగా అయితే గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. దీపికా పదుకొణె పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా చూపించారు. మొత్తంగా ఓ సైన్స్ ఫిక్షన్‌ కథని సూపర్ హీరోకి లింక్ చేస్తూ.. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ అద్భుతాన్ని చేయబోతున్నాడనేది అర్థమవుతుంది.

వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ (Project K)ను తెరకెక్కిస్తోంది. మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నాడనే ప్రకటన వెలువడడమే ఆలస్యం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌లు కీలక పాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ కీ రోల్‌ ప్లే చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story