13 July 2022 4:00 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Puneeth Rajkumar:...

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అతిథి పాత్రలో 'లక్కీ మ్యాన్'.. తన వాయిస్‌తోనే..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం శాండిల్‌వుడ్‌ను మాత్రమే కాదు మొత్తం సినీ పరిశ్రమనే షాక్‌కు గురిచేసింది.

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అతిథి పాత్రలో లక్కీ మ్యాన్.. తన వాయిస్‌తోనే..
X

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం శాండిల్‌వుడ్‌ను మాత్రమే కాదు మొత్తం సినీ పరిశ్రమనే షాక్‌కు గురిచేసింది. అప్పటివరకు అందరితో సంతోషంగా ఆడిపాడుతూ ఉన్న పునీత్.. హఠాత్తుగా అందరినీ వదిలేసి వెళ్లిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఇక తెరపై పునీత్ సినిమాలు కనిపించవా అనుకునే వారికి చివరి ఆశగా మిగిలింది లక్కీ మ్యాన్.

పునీత్ రాజ్‌కుమార్ చనిపోయే సమయానికి ఎన్నో సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నారు. అందులో హీరోగా నటించిన 'జేమ్స్' చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలయ్యింది. ఇక ఆయన నటించిన ఆఖరి చిత్రం మరొకటి ఉంది. అదే 'లక్కీ మ్యాన్'. ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ, రోషని ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. పునీత్ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రానికి రీమేక్‌గా లక్కీ మ్యాన్ తెరకెక్కింది. ఇందులో పునీత్ ఓ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే జేమ్స్ సినిమాలో పునీత్‌కు తన అన్న శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు. కానీ లక్కీ మ్యాన్‌లో అలా కాదట. పునీత్ ఒరిజినల్ వాయిస్‌ను డబ్బింగ్ కోసం ఉపయోగించనుందట మూవీ టీమ్. లక్కీ మ్యాన్‌లో పునీత్ రాజ్‌కుమార్ వాయిస్ స్పెషాలిటీగా నిలవనుంది. అంతే కాకుండా ప్రభుదేవతో కలిసి ఈ మూవీలో అప్పు డ్యాన్స్ హైలెట్‌గా నిలవనుంది. లక్కీ మ్యాన్ ఆగస్ట్‌లో విడుదల కానుందని మూవీ టీమ్ ప్రకటించింది.


Next Story