పుష్ప-2లో షికావత్‌ సార్‌ కీలక షెడ్యూల్ పూర్తి

పుష్ప-2లో షికావత్‌ సార్‌ కీలక షెడ్యూల్ పూర్తి
సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప-2 దిరూల్ (Pushpa-2 The Rule) గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపిక్‌

సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప-2 దిరూల్ (Pushpa-2 The Rule) గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపిక్‌గా మారుతోంది. పుష్పగా ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) నటనకు బ్రిలియంట్ డైరెక్టెర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప-2కు సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వేర్‌ఈజ్ పుష్ప, హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు వచ్చిన భారీ స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే తాజాగా పుష్ప-2 గురించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీస్‌ ఆఫీసర్ భన్వర్‌సింగ్ షికావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ ఫాజిల్‌తో సుకుమార్ ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది.

దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఫహద్‌ఫాజిల్‌తో దర్శకుడు సుకుమార్ కనిపిస్తున్న పోస్‌ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. ఫహద్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు అంటూ క్యాప్షన్‌ జత చేశారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌రైటింగ్స్ కలయికలో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story