Radhana Ram: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో సీనియర్ హీరోయిన్ వారసురాలు..

Radhana Ram: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో సీనియర్ హీరోయిన్ వారసురాలు..
Radhana Ram: ఓ సీనియర్ హీరోయిన్ వారసురాలు కూడా నటిగా పరిచయం కానుంది.

Radhana Ram: సినీ పరిశ్రమలో నెపోటిజంపై ఎంత నెగిటివిటీ వస్తున్నా.. చాలామంది నటీనటుల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి తమను తాము నిరూపించుకోవాలి అనుకుంటున్నారు. సౌత్, నార్త్ తేడా లేకుండా కొత్తగా వస్తున్న వారసులు అందరికీ పోటీ ఇస్తున్నారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ వారసురాలు కూడా నటిగా పరిచయం కానుంది. అంతే కాకుండా మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్‌లో చేసే ఛాన్స్ కొట్టేసింది.

సీనియర్ నటి మాలాశ్రీ అంటే ఒకప్పుడు తెలుగులోనే కాదు ఇతర సౌత్ భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. రొమాంటిక్ హీరోయిన్‌గా ఎంతోమంది మనసు దోచుకున్న మాలాశ్రీ.. ఆ తర్వాత నిర్మాత రామును పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయారు. అయితే ఇన్నాళ్ల తర్వాత తాను మరోసారి కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. అది కూడా తన కుమార్తె రాధనా రామ్ కోసం.

మాలాశ్రీ కూమార్తె రాధనా రామ్.. కన్నడ స్టార్ హీరో దర్శన సరసన ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ మూవీ కేవలం కన్నడలోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధనా మాట్లాడుతూ '13 ఏళ్ల నుండే నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని కలలు కనడం మొదలుపెట్టాను. నేను డెబ్యూ గురించి రెడీగానే ఉన్నాను. కానీ ఇంత పెద్దగా నా డెబ్యూ జరుగుతుందని ఊహించలేదు' అని చెప్పింది.


Tags

Next Story