రాజ్ రాచకొండ "8.AM.మెట్రో" విడుదల
"మల్లేశం" చిత్రంతో అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలు దండిగా అందుకున్న రాజ్ రాచకొండ తాజాగా రూపొందించిన చిత్రం "8 A.M మెట్రో". స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి రాజ్ రాచకొండ నిర్మించిన ఈ సినిమా మే ౧౯న మొదట హిందీ భాషలో విడుదల కానుంది. తరువాత మిగతా ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె.రాబిన్స్ సంగీతం అందించారు.
అయితే ఈ సినిమా పూర్తి ఎమోషనల్ బ్యాగ్‌రౌండ్‌తో ఉండనున్నట్లు తెలుపుతున్నారు చిత్ర బృందం. నిర్లిప్తంగా సాగిపోతున్న ఒక వివాహిత జీవితంలో "మెట్రో ట్రైన్"లో జరిగిన పరిచయం "స్నేహం"గా మారడం నేపథ్యంలో తెరకెక్కించారు. కాగా ఈ చిత్రంలోని కవితలు ప్రఖ్యాత గీత రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత గుల్జార్ రాయడం విశేషం. మరీ ఈ సారీ రాజ్ రాచకొండకు ఎలాంటి అనుభవం ఎదురౌతుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com