Rajinikanth: ఇండస్ట్రీలో రజినీకి 47 ఏళ్లు.. ఇద్దరు కూతుళ్ల ఎమోషనల్ పోస్టులు..
Rajinikanth: ఏ సపోర్ట్ లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి, యాక్టర్ అవ్వాలన్న తమ కలలను నిజం చేసుకోవచ్చు అని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వారిలో రజినీకాంత్ ఒకరు. ఏమీ లేని స్థాయి నుండి సూపర్ స్టార్ స్థానానికి ఎదిగారు రజినీకాంత్. తాను ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి కమల్ హాసన్ స్టార్ హీరోగా ఉన్నా కూడా తనతో పోటీపడి మరీ సూపర్ స్టార్ అయ్యారు రజినీ. ఇక సినీ పరిశ్రమలో రజినీకి 47 ఏళ్లు పూర్తవ్వడంతో తన ఇద్దరు కూతుళ్లు స్పెషల్ పోస్టులను షేర్ చేశారు.
కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు రజినీకాంత్. ఆ తర్వాతే తనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. మామూలు సీన్‌ను కూడా తన స్టైల్‌తో ఓ రేంజ్‌కు తీసుకెళ్లేవారు రజినీ. ఇక ఆ స్టైల్‌తోనే తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫ్యాన్స్‌ను చేసుకున్నారు. తెలుగులో రజినీ నేరుగా చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఇక్కడ ఆయన ఫ్యాన్ బేస్ తక్కువేమీ కాదు.
ముందుగా ఇండస్ట్రీలో 47 ఏళ్లు పూర్తయ్యినందుకు తన తండ్రికి విషెస్ తెలిపింది ఐశ్వర్య రజినీకాంత్. '47 ఏళ్ల రజినీఇజం.. ఎన్నో కష్టాల సమూహం, అంకితభావం. ఆయనకు పుట్టినందుకు గర్వంగా ఉంది' అంటూ ట్వీట్ చేసింది. ఇక మరో కూతురు సౌందర్య రజినీకాంత్ కూడా '47 ఏళ్ల మ్యాజిక్. నువ్వు దేవుడి బిడ్డవు నాన్న. మాటల్లో చెప్పలేని ఎమోషన్ నువ్వు. లవ్యూ తలైవా' అని ట్వీట్ చేశారు.
76 years of independence 🇮🇳 saluting sacrifices,struggles n strength.. #proudindian🇮🇳
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) August 15, 2022
47 years of #rajinism .. sheer hard work grit n dedication !proud to born to him #prouddaughter❤️ pic.twitter.com/be5yZGDHwu
47 years of pure magic !!! 💫💫💫 you are gods child dearest appa !!!! You are an emotion that words cannot explain !!!
— soundarya rajnikanth (@soundaryaarajni) August 15, 2022
Love you Thalaivaaa 💜💜💜🙏🏼🙏🏼🙏🏻 #47YearsOfRajinism pic.twitter.com/b4bzmcYLzz
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com