Laal Salaam: అన్నమలయార్ దీవెనులు తీసుకున్న రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ తరువన్నమలై దీవెనలు తీసుకున్నారు. లాల్ సలామ్ షూటింగ్ ప్రారంభం అవుతుండటంతో స్వామి వారి సేవలో పాలుపంచుకున్నారు. తిరువన్నమలై ఆలయ పరివాహక ప్రాంతంలోనే షూటింగ్ ప్రారంభమవుతుండటంతో ముందుగా స్వామి వారి ఆశీస్సులు తీసుకునే పని మొదలుపెట్టాలని రజినీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దర్శనం పూర్తిచేసుకున్న సూపర్ స్టార్ కు ఆలయ నిర్వాహకులు సినిమా విజయవంతం అవ్వాలని ఆశీర్వచనం ఇచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ ఐశర్వ దర్శకత్వంలో లాల్ సలామ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2012లో వాయ్ రాజా వాయ్ అనే సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్న ఐశ్వర్య, ఆ తరువాత వీరన్ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. స్టంట్ కొరియోగ్రఫర్ల జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ డాక్యమెంటరీకి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ సూభాస్కరన్ నిర్మాణ సారధ్యంలో లాల్ సలామ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
చివరిగా అన్నాట్టే సినిమాలో కనిపించిన రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com