Ram Gopal Varma : రామగోపాల్ వర్మ "సత్య" కు పాతికేళ్ళు

Ram Gopal Varma : రామగోపాల్ వర్మ సత్య కు పాతికేళ్ళు
X
2కోట్లతో తీసిన సినిమా, 18 కోట్ల కలెక్షన్ లతో బాక్సాఫీస్ హిట్

మూస సినిమాల సమయంలో తెలుగు సినిమా గతిని మార్చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రంగీలా, క్షణక్షణం సినిమాలతో బాక్సాఫీస్లు బద్దలు గొట్టిన వర్మ మూడవ సినిమా సత్య. 1998 వరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు సరికొత్త అర్దాన్ని చెప్పిన సినిమా. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ ప్రయోగానికి అప్పట్లో



దేశమంతా ఎట్రాక్ట్ అయ్యింది. రియల్ ఇన్సిడెంట్ నుంచి మొదలైన కథను వర్మ చూపించిన విధానమే అందుకు కారణం. సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి 25 ఏళ్లవుతోంది.

గ్యాంగ్ స్టర్స్ అన్న పేరు వినడమే గానీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వర్మ చూపించిన విధానం కళ్ళముందే ఇదంతా జరుగుతున్నాదన్న భావన కలిగించింది.ఒక రియల్ గ్యాంగ్ స్టర్ జీవితాన్ని దగ్గరనుంచి చూసి ఈ సినిమా ప్లాన్ చేశానని చెబుతారు వర్మ. రియల్ ఇన్సిడెంట్స్తో కొత్త నటీనటులతోనే షూట్ చేశారు. ఈ సినిమాలో జెడి చక్రవర్తి లీడ్ గా నటించారు. ఊర్మిలా మాటోండ్కర్ హీరోయిన్. మనోజ్ బాజ్‌పేయితో పాటు అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్లాతో సహా చాలా మంది ఈ సినిమాతో తెరకు పరిచయం అయ్యారు.

అయితే సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయింది. మళ్ళీ రెండు వారాల అనంతరం రామ్ గోపాల్ వర్మ చర్చలతో సినిమాను మొదలు పెట్టారు. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరన్న కారణంగా వర్మ తనదైన శైలిలో విశాల్ భరద్వాజ్ తో పాటలను కంపోజ్ చేయించాడు. అది కూడా సినిమా కధలో ఇమిడి పోయేలా.

2కోట్ల బడ్జెట్ తో అతికష్టం మీద షూటింగ్ పూర్తి చేసిన రామ్ గోపాల్ వర్మ జూలై 3న సినిమాను విడుదల అయ్యింది. మొదట్టి 2 రోజులు మాములుగా ఉన్నా సినిమా ఫస్ట్ వీకెండ్ అనంతరం హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 18కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు టాక్. 1998లో అత్యదిక వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా సత్య న్యూ రికార్డును క్రియేట్ చేసింది.

Tags

Next Story