Rashmika Mandana: చిట్టిపొట్టి డ్రెస్సు అంటే మహా ఇబ్బందే సుమీ...!

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి కట్టుబొట్టును పూర్తిగా ఒంటబట్టంచుకుంటోన్న మన కన్నడ కస్తూరి ఇటీవలే జీ సినీ అవార్డుల ఫంక్షన్ లో ఓ చిట్టి పొట్టి డ్రెస్సులో కనువందు చేసింది. అయితే అక్కడ ఇమిడేందుకు అమ్మడు ఎంత కష్టబడుతోందో దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాది వారికి నచ్చిన విధంగా ఉండాలన్న తపనలో చిన్ని గౌను అయితే వేసుకుంది గానీ, అందులో ఎంత ఇబ్బంది పడుతోందో చూసిన వారికి ఇట్టే అర్ధమైపోతోంది. ఫొటోగ్రాఫర్లు ధైర్యంగా ఫోజులు అయితే ఇచ్చింది గానీ, ఆమెలో ఏ మూలనో ఉన్న చిన్న ఇబ్బంది అయితే అభిమానుల దృష్టిని దాటిపోలేదు. ఏమైనా మన శ్రీవల్లి చిన్ని బ్లాక్ డ్రెస్ లో అందాల చందమామలా ఉంది అనడంలో సందేహమేలేదనుకోండి. మిలమిలా మెరిసిపోతున్న రష్మికను చూసేందుకు రెండు కళ్లూ చాలవు అనడంలో సందేహమే లేదు. ఏమైనా అమ్మడు ఇదే ఊపులో బాలీవుడ్ లో మరిన్ని ప్రాజెక్ట్ లు అందిపుచ్చుకుంటుందని ఆశిద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com