Rakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

Rakshit Shetty: సినీ పరిశ్రమలో డేటింగ్ అనేది చాలా కామన్. అలా కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకుల వరకు వెళ్లిన జంటలు కూడా ఉన్నాయి. కానీ రష్మిక మందనా మాత్రం కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి.. నిశ్చితార్థం కూడా చేసుకున్న తర్వాత పెళ్లిని క్యాన్సిల్ చేసింది. అయితే ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిన తర్వాత ఇంతకాలం సింగిల్‌గా ఉన్న రక్షిత్.. త్వరలోనే ఓ నటిని పెళ్లి చేసుకోనున్నట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం శాండిల్‌వుడ్‌లో రక్షిత్ శెట్టి, టాలీవుడ్‌లో రష్మిక బాగానే సెటిల్ అయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. కానీ గత కొన్నిరోజులుగా శాండిల్‌వుడ్ బ్యూటీ రమ్యను రక్షిత్ పెళ్లి చేసుకోనున్నాడు అనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై రక్షిత్ స్నేహితుడు రిషబ్ శెట్టి స్పందించాడు. ఇదంతా ఫన్నీగా ఉంది అంటూ కొట్టిపారేశాడు. ఇక తాజాగా రక్షిత్ కూడా తన పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై నోరువిప్పాడు.
రక్షిత్ శెట్టి.. రమ్యను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇంతవరకు అసలు రమ్యను తానెప్పుడు కలవలేదు అన్నాడు రక్షిత్. అంతే కాకుండా కాలేజీ రోజుల్లో రమ్య అంటే తనకు క్రష్ ఉండేదని బయటపెట్టాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన రమ్య.. ఇండస్ట్రీకి దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. అందుకే తను తిరిగి నటిస్తే చూడాలని ఉందని అన్నాడు రక్షిత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com