19 July 2022 1:35 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Rashmika Mandanna:...

Rashmika Mandanna: రష్మికకు మరో బంపర్ ఆఫర్.. సీనియర్ హీరోతో సినిమా..

Rashmika Mandanna: ప్రస్తుతం రష్మిక చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. అదే ‘పుష్ప 2’.

Rashmika Mandanna: రష్మికకు మరో బంపర్ ఆఫర్.. సీనియర్ హీరోతో సినిమా..
X

Rashmika Mandanna: సినీ పరిశ్రమలోకి ఎంతమంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా.. కొందరు సీనియర్ హీరోయిన్ల క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. వారిలో ఒకరే రష్మిక మందనా. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ.. ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉంటోంది ఈ భామ. అయితే ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతున్న రష్మిక.. కోలీవుడ్‌లో కూడా ఆఫర్ల మీద ఆఫర్లు దక్కించుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం రష్మిక చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. అదే 'పుష్ప 2'. ఇక దీంతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సరసన 'వారిసు'లో నటిస్తుంది. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది రష్మిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలోనే రష్మికకు కోలీవుడ్‌లో మరో ఆఫర్ వచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటిస్తున్న రష్మిక.. దీని తర్వాత విక్రమ్‌తో జతకట్టనుందని సమాచారం. విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. అయితే ఈ మూవీలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే స్పీడ్‌లో వెళ్తే ఈ అమ్మడు కోలీవుడ్‌లో కూడా బిజీ అవ్వడం ఖాయం అనుకుంటున్నారు ప్రేక్షకులు.



Next Story