Rasi Khanna: మబ్బుల్లో తేలిపోతున్న అందాల రాశి

Rasi Khanna: మబ్బుల్లో తేలిపోతున్న అందాల రాశి
ఫర్జీ సక్సెస్ ఇచ్చిన కిక్; మంచి ఊపు మీద ఉన్న రాశీ ఖన్నా; మరిన్ని ప్రాజెక్ట్ ల్లో మెరిసే అవకాశం

తెలుగు నాట రాశీ ఖన్నా హాడావిడి కాస్త తగ్గిందే అని అనుకునే లోగానే ఫర్జీతో మన ముందుకు వచ్చి అదిరిపోయే సప్రైజ్ ఇచ్చింది. స్పెషల్ ఫోర్స్ అధికారిణిగా అందం, హుందాతనం కలబోసిన పాత్రలో అమ్మడు యాక్టింగ్ ఇరగదీసిందనే చెప్పాలి. ఇక ఇంటిమేట్ సీన్లలోనూ ఎక్కడా తగ్గకుండా నటించేయడంతో ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంకేముంది ప్రస్తుతం రాశికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయనే చెప్పాలి. మరోవైపు హాట్ ఫొటోషూట్ లతో దండయాత్ర చేస్తోన్న రాశి.. తాజాగా ఎర్రని చీర కట్టి అబ్బాయిలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేనప్పటికీ తమిళంలో నాలుగు సినిమాలకు అమ్మడు సంతకాలు చేసేసిందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తుండటంతో ప్రస్తుతం ఉత్తరాది పరిశ్రమపైనే రాశీ దృష్టి పెట్టనుందని తెలుస్తోంది.Tags

Read MoreRead Less
Next Story