Ravi Kishan: అగ్నిపథ్‌లో చేరనున్న నటుడి కుమార్తె.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్..

Ravi Kishan: ఓవైపు అగ్నిపథ్ అనే ఒక్క పథకం వల్ల దేశంలోని యువతీయువకులు చాలామంది నిరసనలు చేపట్టారు. కానీ ఈ పథకాన్ని ఇష్టపడిన వాళ్లు కూడా లేకపోలేదు. ఈ పథకంతో దేశానికి కొన్నాళ్లు సేవ చేయవచ్చు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న యువత కూడా ఉన్నారు. అందులో ఓ సీనియర్ నటుడి కుమార్తె కూడా ఉంది. తాను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని తన తండ్రే సంతోషంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భోజ్‌పూరీ నటుడు రవి కిషన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంతోమంది పరభాషా నటులు మోస్ట్ వాంటెడ్ విలన్స్‌గా గుర్తింపు పొందారు. అందులో రవి కిషన్ కూడా ఒకరు. 'రేసుగుర్రం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ఈ నటుడు. ఆ తర్వాత కూడా విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి కూడా దిగారు. ఇటీవల లోక్ సభ అభ్యర్థిగా కూడా ఎందపికయ్యారు. తాజాగా తన కూతురు గురించి రవి కిషన్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.
'నా కూతురు ఇషితా శుక్లా.. ఈరోజు ఉదయం నేను కూడా అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో భాగమవ్వాలని అనుకుంటున్నాను నాన్న అని నాతో చెప్పింది. నేను సంతోషంగా సరే అన్నాను' అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రవి కిషన్. ఓవైపు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటే రవి కిషన్ లాంటి నటుడు ఇలా చెప్పడంతో ప్రస్తుతం సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయంగా కూడా ఇది చర్చగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com