RRR: హృతిక్‌ను అలా అన్నందుకు చింతిస్తున్నా: రాజమౌళి

RRR: హృతిక్‌ను అలా అన్నందుకు చింతిస్తున్నా: రాజమౌళి
X
హృతిక్‌ను దిగజార్చాలని ఆ వాఖ్యలు చేయలేదు

"ఆర్‌ఆర్‌ఆర్‌" సినిమా గోల్డెన్‌గ్లోబ్‌ అందుకున్నప్పటి నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో హృతిక్‌ రోషన్‌ ను ప్రభాస్‌తో పోలుస్తూ చేసిన వాఖ్యలే ఇప్పుడు అతడిని చిక్కుల్లోకి నెట్టాయి. వాటిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చిన నెటిజన్లు, హృతిక్‌ అభిమానులు జక్కన్నను సారీ చెప్పె వరకు వదల్లేదు.


ప్రభాస్‌ ముందు హృతిక్‌ ఏమాత్రం పనికి రాడని గతంలో రాజమౌళి అన్నమాట ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తాను చేసిన వాఖ్యలపై జక్కన్న స్పందించారు.


తన వాఖ్యలు సరైనవి కావు, ప్రభాస్‌తో హృతిక్‌ను పోల్చండం తప్పేనని అంగీకరించాడు. అయితే హృతిక్‌ను దిగజార్చాలని తాను ఆ విధంగా మాట్లాడలేదని, హృతిక్‌ అంటే తనకు చాలా గౌరవం ఉందని రాజమౌళి పేర్కొన్నాడు. కాగా హృతిక్ రోషన్ చివరిగా పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన విక్రమ్ 'వేద' సినిమాలో కనిపించగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఫైటర్‌' సినిమాలో దీపికా పదుకొణెతో కలిసి కనిపించబోతున్నాడు. మరో వైపు ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌లతో మన ముందుకు రాబోతున్నాడు.


Tags

Next Story