RRR: అయ్యా! ఆయనకూ అవార్డు ఇచ్చామయ్యా...!

RRR: అయ్యా! ఆయనకూ అవార్డు ఇచ్చామయ్యా...!
X
హాలీవుడ్ ను తాకిన టాలీవుడ్ ఫ్యాన్స్ వర్గ పోరు; యంగ్ టైగర్ గైర్హాజరీపై HCA క్లారిటీ....

టాలీవుడ్ లో అభిమానుల మధ్య జరిగే స్టార్ వార్స్ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కు వెళ్లాయి. ఫ్యాన్స్ దెబ్బకు హాలీవుడ్ జనాలు కూడా బెదిరిపోయి, దెబ్బకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకూ ఏమయిందంటే... ఆర్.ఆర్.ఆర్.కు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. ఆ పురస్కార ప్రధానోత్సవానికి రామ్ చరణ్, రాజమౌళి హాజరయ్యి పురస్కారాలను అందుకున్నారు. దీనిపై యావత్ భారత్ పులకించిపోయినప్పటికీ..... జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగా హర్ట్ అయ్యారు. అదిగో చెర్రీకి ఇచ్చి మా యంగ్ టైగర్ ను ఎలా విస్మరిస్తారు అంటూ ఒక్కటే ట్రోలింగ్ మొదలెట్టేశారు. దీంతో HCA అసోసియేషన్ కు దిమ్మతిరిగింది. దెబ్బకు దిగివచ్చి ట్విట్టర్ లో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. జూ.ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపామని, కానీ, ఆయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు పేర్కొన్నారని వెల్లడించారు. అయితే ఆయన పురస్కారం పదిలంగా ఉందని, త్వరలోనే యంగ్ టైగర్ కు పురస్కారాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు. ఇక దీనికి ఓ ఔత్సాహిక అభిమాని ఎన్టీఆర్ గైర్హజరకు కారణం షూటింగ్ కాదని, తన సోదరుడి అకాల మరణం వల్ల రాలేకపోయారని వివరణ ఇవ్వగా, దీనిపై కూడా HCA క్లారిటీ ఇచ్చేసింది. తమకు అందిన సమాచారం మేరకు జూ.ఎన్టీఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారని, అయితే ఈ క్రమంలో ఆయన సోదరుని మరణం వల్ల షూటింగ్ కు కూడా వెళ్లలేకపోతున్నరని తెలిసిందని చెప్పుకొచ్చారు.



Tags

Next Story