RRR: ఆస్కార్ వేదికపై.. మోత మోగనున్న నాటు నాటు

ఆస్కార్ వేదికపై... నాటు నాటు పాట మోత మోగనుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నామినేషన్ కు ఎంపికై ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు అవార్డుల కార్యక్రమంలో వేదిక పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ పాటను లైవ్‌లో పాడనున్నారు రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ. వీరిద్దరి ప్రదర్శన గురించి ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ఆస్కార్ కమిటీ. వారం రోజుల్లో జరిగే వేడుకను రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆస్కార్ అవార్డుల కమిటీ. రెండున్నర నిమిషాల పాటు సాగే ప్రదర్శనలో అమెరికన్ డ్యాన్సర్లు ఈ పాటకు డాన్స్ వేయనున్నారు. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు.ఆస్కార్స్ స్టేజిపై నాటు నాటు లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుందనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. RRR ఫర్ ఆస్కార్స్", "నాటు నాటు" హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఈ పాటకు రామ్‌చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం లేదు. దీంతో స్టేజిపై సాంగ్ పాడేటప్పుడు ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో స్టెప్పులు వేయించాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. తమ హీరోలతో డ్యాన్స్ కూడా వేయించండంటూ అకాడమీని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు
అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ రామ్‌చరణ్ కలిసి ‘నాటు నాటు’ హుక్ స్టెప్ వేస్తే చూడాలని యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’కు అవార్డు వస్తే RRR’ టీమ్ హుక్ స్టెప్ వేయనుంది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ స్వయంగా చెప్పారు. నాటు నాటు’ స్టెప్ ఎక్కడైనా వేయడాన్ని ఎంతో ఇష్టపడతామని... అయితే, ప్రతి చోటా అది సాధ్యం కావటం లేదన్నారు. ఒకవేళ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆ స్టెప్ వేసే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం ఇంకొటి ఉండదన్నారు. కచ్చితంగా హుక్ స్టెప్ మాత్రం వేస్తామన్నారు రామ్‌చరణ్.
మొత్తం 23 విభాగాల్లో అవార్డులు ఇస్తుంది ఆస్కార్ కమిటి. అందులో 10 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాలను డిసెంబర్ 22న వెల్లడించింది. నామినేషన్స్ కంటే ముందు షార్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు. సాంగ్స్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయిన 15 పాటల్లో నాటు నాటు... ఉంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అరుదైన ఘనత దక్కించుకుంది. ఆస్కార్ స్టేజిపై RRR సినిమాలోని నాటునాటు పాటను లైవ్‌లో పెర్ఫామ్ చేయనున్నారు. నాటు నాటును లైవ్‌లో పాడటంపై స్పందించిన గాయకుడు కాల భైరవ..... ఇదొక గొప్ప అనుభూతి అని.. మాటల్లో చెప్పలేనన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక అయిన ఆస్కార్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com