RRR : రాజమౌళి డ్రెస్సింగ్ సెన్స్ అదిరెన్... కంగన కామెంట్

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని 'నాటు నాటు...'సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి పై ఇప్పటికే పలువురు ప్రపంచ స్థాయి ప్రశంసలు కురిపించారు. దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ పై అభినందనీయులు తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మోస్ట్ కాంట్రవర్శీ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించింది. "ముందుగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ను అందుకున్న 'ఆర్ఆర్ఆర్'టీమ్ కు నా అభినందనలు అంటూ తెలిపింది. అంతేకాక రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ అవార్డు ఫనక్షన్ లో జక్కన్న వేసుకున్న డ్రెస్సింగ్ సూపర్ అని, భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా అతడి వస్త్రధారణ చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను" అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
దీంతో అవార్డ్ అందుకున్న రాజమౌళి నిజంగా గ్రేట్ అని, అలాంటి ఈవెంట్ కు ధోతీ, కుర్తా ధరించిన జక్కన్న సూపర్ అంటూ పలువురు రాజమౌళిని పొగిడేస్తున్నారు. మరోవైపు ఇలాంటి మంచి పోస్ట్ ను షేర్ చేసిన కంగనను కూడా నెటిజన్లు అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com