RRR సినిమా విలన్ రే స్టీవెన్సన్ కన్నుమూత
వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన RRR సినిమా విలన్, హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. విలక్షణమైన పాత్రల్లో నటించిన ఈ సెన్సేషనల్ యాక్టర్ హఠాన్మరణం చెందారు. రే స్టీవెన్సన్ మృతి పట్ల ట్రిపుల్ ఆర్ టీమ్‌తో పాటు టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ఆత్మకు శాంతి కలగాలి.. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారని రాజమౌళి ట్వీట్ చేశారు.
ట్రిపుల్ ఆర్ చిత్రంలో గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ పాత్రలో రే స్టీవెన్సన్ అద్భుతంగా నటించారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి రాజుగా పాత్రకు తగినట్లుగా తన నటన, హావాభావాలు పలికించి మెప్పించిన ఈ హాలీవుడ్ నటుడు.. 1990లలో టీవీ షోలలో కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత అడ్వెంచర్ మూవీ కింగ్ ఆర్థర్ సహా పలు యాక్షన్ వార్ సినిమాల్లో నటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com