RRR Movie: రామ్ చరణ్ ఇండియన్ బ్రాడ్ పిట్
చెర్రీని బ్రాడ్‌పిట్‌తో పోల్చిన KLTA ఎంటర్‌టైన్మెంట్

RRR చిత్రం ఆస్కార్ అవార్డ్ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడ్‌మార్నింగ్ అమెరికా అనే టాక్‌షోకు హాజరైన చెర్రీ అంతర్జాతీయ టాబ్లాయిడ్స్ లో తళుక్కుమన్నాడు. తాజాగా KLTA ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమంలోనూ మెరిసాడు. ఈ కార్యక్రమంలో తనను పరిచయం చేసే క్రమంలో హోస్ట్ చెర్రీని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అని సంభోధించడంతో మెగా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. దీనికి చెర్రీ కూడా అంతే అనందంగా స్పందించాడు. తనకు బ్రాడ్ పిట్ అంటే ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు. ఏమైనా మన తెలుగు తేజం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం మనకెంతో గర్వకారణమనే చెప్పాలి.
Next Story