RRR Movie: హాలీవుడ్‌లో సినిమా తీస్తా: రాజమౌళి

RRR Movie: హాలీవుడ్‌లో సినిమా తీస్తా: రాజమౌళి
"ఆర్‌ఆర్‌ఆర్‌ " టీం పై ప్రియాంక చోప్రా ప్రశంశల జల్లు

"ఆర్‌ఆర్‌ఆర్‌ " సినిమా గోల్డెన్‌గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ లాంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకొని అందరి మన్ననలు పొందుతోంది. తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రపంచంలోని అందరి చూపులను తన వైపే తిప్పుకున్నాడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.


ఈ క్రమంలోనే జక్కన్న ఇంటర్నేషనల్‌ ఫిలీం మేకర్సైన జేమ్స్‌ కేమిరాన్‌, స్టీవ్‌ స్పీల్‌బర్గ్‌ లాంటి దిగ్గజాలను కలుసుకున్నారు. వారు ఇద్దరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారం దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తారక్‌ను, రామ్‌ చరణ్‌ను హాలీవుడ్‌లో నటించేందుకు ఏమైన ప్లాన్‌ చేస్తున్నారా అని అడగగా రాజమౌళి తన సినిమాలను హాలీవుడ్‌లో తీయాలనుకుంటున్నట్లు తెలిపాడు.


అమెరికా మ్యాగజైన్‌ కు ఇంటర్వ్యూ ఇస్తూ జక్కన్న హాలివుడ్‌ గురించి తన మనసులోని మాటలను ఇలా బయట పెట్టాడు. ఏ డైరెక్టర్‌ అయినా తన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చూపించాలనే అనుకుంటాడు, అందుకు తప్పకుండా హాలీవుడ్‌లోనే డైరెక్టర్ గా సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.


తనకు హాలివుడ్‌ లో ప్రయోగం చేయాలనుంది, కానీ దానిని ఎలా మెదలు పెట్టాలో అర్థం కావట్లేదన్నారు. తప్పకుండా ఇతరుల కొలాబరేషన్‌తో సినిమా తీస్తానని స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా రాజమౌళి, కీరవాణీలను కలిసి అభినందనలు తెలియజేసింది. ఆ విషయాన్ని అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్, అజయ్‌దేవ్‌గణ్, అలియాభట్‌ నటనను అభినందించింది. అలాగే నాటు నాటు పాట పాడిన కాల భైరవను, పాటల రచయిత చంద్రబోస్‌ను కూడా ప్రశంసించింది.

Tags

Next Story