Mahesh Babu: మొదటిసారి మహేశ్ బాబు అలా.. తమిళ స్టార్ హీరోతో కలిసి..
Mahesh Babu: ఏ సినిమాలో మహేశ్ బాబు గెస్ట్ రోల్ మాత్రం చేయలేదు. ఇప్పుడు తానే ఆ రూల్ బ్రేక్ చేయనున్నాడు.

Mahesh Babu: పాన్ ఇండియా సినిమాల కల్చర్ ప్రారంభమయిన తర్వాత ఏ హీరో కూడా ఒక భాషకే పరిమితం కావడం లేదు. కుదిరినప్పుడు వేరే భాషా చిత్రాల్లో, ఇతర భాషల హీరోలతో కూడా కలిసి నటిస్తున్నారు. ఇప్పటివరకు గెస్ట్ రోల్స్ చేయని మహేశ్ బాబు కూడా ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఓ తమిళ చిత్రంలో మహేశ్ గెస్ట్ రోల్ చేయనున్నాడని టాక్ వైరల్ అవుతోంది.
మహేశ్ బాబు ఇప్పటివరకు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించాడు. అంతే కాకుండా అప్పుడప్పుడు పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు. కానీ ఏ సినిమాలో గెస్ట్ రోల్ మాత్రం చేయలేదు. ఇప్పుడు తానే ఆ రూల్ బ్రేక్ చేయనున్నాడు. తన స్నేహితుడు, దర్శకుడు వంశీ పైడిపల్లి కోసమే మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న 'తళపతి 66'లో మహేశ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల వంశీ పైడిపల్లి ఈ విషయంపై మహేశ్‌ను ఒప్పించాడట. ఇదే నిజమైతే రెండు ఇండస్ట్రీలో స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడడానికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం సినిమాకు ప్లస్ అవుతుంది.
RELATED STORIES
Taapsee Pannu : తన శృంగార జీవితంపై తాప్సీ ఏమన్నదో తెలుసా..?
8 Aug 2022 4:16 PM GMTRajinikanth : తన పొలిటికల్ ఎంట్రీపై రజినీ ఏమన్నారంటే..?
8 Aug 2022 3:31 PM GMTNachindi Girl Friendu : దోస్త్ అంటే నువ్వేరా సాంగ్‌ను రిలీజ్ చేసిన...
8 Aug 2022 2:01 PM GMTHansika Motwani : హన్సిక వయసెంతో తెలుసా..?
8 Aug 2022 12:01 PM GMTDulquer Salmaan: హీరోగా చేస్తానంటే పరువుతీయొద్దన్నారు: దుల్కర్
8 Aug 2022 10:53 AM GMTRashmika Mandanna: అక్కినేని హీరోతో రష్మిక రొమాన్స్..
8 Aug 2022 7:34 AM GMT