Samantha: మరోసారి ఆ తమిళ స్టార్ హీరోతో జోడీకట్టనున్న సమంత..

Samantha: సమంత.. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాలు చేస్తోంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సమంత వరుసగా హిట్లు కొడుతూ వెళ్తోంది. ఇటీవల సమంత నటించిన 'కాతువాకుల రెండు కాదల్' చిత్రం తమిళ ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇంతలోనే సమంతకు మరో తమిళ సినిమాలో అవకాశం వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
సమంత.. దాదాపు రెండు సంవత్సరాలు తమిళ మూవీ వైపు వెళ్లకుండా తెలుగుపైనే ఫోకస్ పెట్టింది. ఇక రెండేళ్ల తర్వాత విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి 'కాతువాకుల రెండు కాదల్'లో నటించింది. ఇందులో ఖతీజా పాత్రలో సమంత నటన మరోసారి అందరినీ ఆకట్టుకుంది. దీంతో మరోసారి తమిళ మేకర్స్ కన్ను సమంతపై పడింది. అందుకే ఓ తమిళ హీరో సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
శుక్రవారం విడుదలయిన 'విక్రమ్' సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు లోకేశ్ కనకరాజ్. ఇక దీని తర్వాత తను విజయ్‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను సంప్రదించగా తాను కూడా ఓకే చేసినట్టు సమాచారం. ఇప్పటికే విజయ్, సమంత కాంబినేషన్‌లో 'కత్తి', 'తేరీ' చిత్రాలు వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ మూవీ.
ప్రస్తుతం విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో తాను నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇప్పటివరకు విజయ్ నటించిన చిత్రాలన్నీ తమిళం నుండి తెలుగులోకి డబ్ అవ్వగా.. ఇది తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇక ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా రష్మిక మందనా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com