Samantha & Mrunal: ముద్దుగుమ్మల ముచ్చట తీరేనా...!

Samantha & Mrunal: ముద్దుగుమ్మల ముచ్చట తీరేనా...!
ఇన్స్టాలో ముద్దుగుమ్మల ముచ్చట్లు, కలసి నటించడంపై సమంత, మృణాల్ మంతనాలు
ఓ వైపు సమంత, మరోవైపు మృణాల్... టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ వీరిద్దరి హంగామానే కనిపిస్తోందని చెప్పాలి. ఓ వైపు మృణాల్ గుమ్రాహ్ సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకోగా, మరోవైపు సమంత శాకుంతలం ప్రమోషన్స్ తో మస్త్ హడావిడి చేస్తోంది. ఇక ఈ ఇద్దరు ముద్దుగుమ్మలూ తమ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటించేందుకు ఆస్క్ మీ ఏ క్వశ్చిన్ అనే ఫీచర్ ను ఉపయోగించారు ఇరువురు ముద్దుగుమ్మలు. అయితే సమంత పోస్ట్ కు రెస్పాండ్ అయిన మృణాల్, శాకుంతలం చూసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాన్నంటూ స్పందిస్తూనే మనమిద్దరం ఎప్పుడు కలసి పని చేయబోతున్నాం అనే ప్రశ్నను సంధించింది. దీనికి సమంత కూడా అంతే స్వీట్ గా రిప్లై ఇచ్చింది. తప్పకుండా చేద్దాం, మంచి ఐడియా అంటూ స్పందించింది. ఇక ఇన్స్టాలో ఈ ముద్దుగుమ్మ ల ముచ్చట్లకు ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోయారు. వీరి కలయికలో సినిమా రావాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. మరి దర్శక-నిర్మాతలు అమ్మాయిల ఉబలాటాన్ని కాస్త అర్థం చేసుకుంటారేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story