Samantha: ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. సీన్‌లోకి రష్మిక.. ఫ్యాన్స్‌లో చర్చ..

Samantha: ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. సీన్‌లోకి రష్మిక.. ఫ్యాన్స్‌లో చర్చ..
Samantha: సినిమాల విషయంలోనే కాదు బ్రాండ్ల యాడ్స్ విషయంలో కూడా రష్మిక, సమంత పోటాపోటీగానే ఉన్నారు.

Samantha: సినీ పరిశ్రమలో టాప్ 1 ఎవరు అనే పోటీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. వరుసగా ఫ్లాపులు ఎదురయితే టాప్ 1 కూడా రెండో, మూడో స్థానానికి వెళ్లిపోవాల్సిందే. కానీ హీరోయిన్ విషయంలో ఈ లెక్కలు కాస్త వేరేలా ఉంటాయి. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ యావరేజ్ హిట్లు కొట్టినా టాప్ పొజిషన్‌కు వెళ్లిపోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ 1 ఎవరు అని రష్మిక, సమంత ఫ్యాన్స్ మధ్య ఘాటైన చర్చ నడుస్తోంది.

ఒకప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలను దక్కించుకుంటూ ఉండడంతో పూజా హెగ్డే, రష్మిక మధ్య పోటీ నడుస్తుందని భావించారు ప్రేక్షకులు. కానీ అవకాశాలు బాగానే వచ్చినా పూజాకు వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. దీంతో పూజాను రేసు నుండి తప్పించారు. ఇప్పుడు అదే స్పీడ్‌లో ఆఫర్లు అందుకుంటున్న రష్మిక, సమంత మధ్య పోటీ ఏర్పడిందని వారి అభిమానులు అనుకుంటున్నారు.

సినిమాల విషయంలోనే కాదు బ్రాండ్ల యాడ్స్ విషయంలో కూడా రష్మిక, సమంత పోటాపోటీగానే ఉన్నారు. అయితే ఇటీవల ఓ సంస్థ తమ యాడ్ కోసం సమంతను రష్మికతో కలిసి నటించమని అడిగిందట. దీన్ని సమంత సున్నితంగా తిరస్కరించిందట. అయితే రష్మికతో నటించడానికి సమంత సమస్య ఏంటి? రష్మిక డామినేట్ చేసేస్తుందని భయపడుతుందా? అంటూ రకరకాలుగా సమంతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు రష్మిక ఫ్యాన్స్.

Tags

Read MoreRead Less
Next Story