Sandalwood: ఆస్కార్ రిమైండర్స్ లిస్ట్‌లో కాంతారా

తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై ప్రేక్షకులను అలరించిన "కాంతార" మొదట కన్నడంలో విడుదల కాగా తరువాత తెలుగుతో పాటు మిగతా భాషల్లో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ అకాడమీ ప్రకటించిన రిమైండర్స్ లిస్ట్‌లోని 301 చిత్రాల్లో స్థానం సంపాదించింది.ఈ సినిమాతో పాటు మరో పదకొండు భారతీయ సినిమాలు ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి.
కాంతార మేకింగ్‌కు రూ. 16 కోట్లు కాగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 450 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలీం ప్రొడక్షన్స్ రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కు అర్హత సాధించిన చిత్రాల జాబితాలో ఉన్నట్లు తెలిపింది. ఉత్తమ సినిమా అవార్డ్ విభాగంతో పాటు ఉత్తమ నటుడు విభాగాల్లో ఈ సినిమా రిమైండర్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి తన నటనతో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నారు, క్లైమాక్స్‌లో అతని నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాడనే చెప్పవచ్చు. "కాంతార"తో పాటు మరో కన్నడ చిత్రం విక్రాంత్ రోనా, జక్కన్న తీసిన "RRR", ది కశ్మీర్ ఫైల్స్, గంగూభాయ్ కాతియావాడీ, ఆల్ దట్ బ్రీత్స్, ఛెల్లో షో, ది గ్రేమాన్, ఇరావిన్ నిజాళ్, మీ వసంతారో... కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జనవరి 24న 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ తుది జాబితాను విడుదలకానుంది. మరి మన సినిమా రెడ్ కార్పెట్ పై తళుకులీనుతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com