డ్రగ్స్ కేసు..తెరపైకి పలువురు సినీనటులు, రాజకీయ నేతల పేర్లు

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సినీనటులు, రాజకీయనేతల పేర్లు బయటకు వచ్చాయి. కేసు విచారణ నిమిత్తం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆర్‌కె దేవరాజ్ కుమారుడు యువరాజ్ శనివారం సీసీబీ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ కార్పోరేటర్‌గా యువరాజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కన్నడ సినీ నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్‌లకు సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, ఆర్టీఓ క్లర్క్ బీకే రవిశంకర్, రాహుల్ థోన్స్, నైజీరియా సైమన్ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అటు... కేసులో ప్రధాన నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలకు తానే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు సాంబా ఒప్పుకున్నాడు. బెంగళూరుతో పాటు చుట్టు పక్కల రిసార్ట్‌లలో రాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏడుగురు రాజీకయనేతలు కూడా డ్రగ్స్‌కేసులో ఉన్నట్లు సీసీబీ అధికారుల వద్దా పక్కా సమాచారం ఉందని బెంగళూర్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకుడు ఆదిత్య ఆళ్వా నివాసంపైనా, హౌస్ ఆఫ్ లైఫ్ రిసార్ట్, ఇంటిలో సోదాలు జరిపారు. డ్రగ్స్ కేసు వెలుగుచూసినప్పటి నుంచీ ఆదిత్య అదృశ్యమయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com