డ్రగ్స్‌ కేసు : నటి సంజన అరెస్టు!

డ్రగ్స్‌ కేసు : నటి సంజన అరెస్టు!
X
కొద్దిరోజులుగా శాండల్‌వుడ్‌ను డ్రగ్స్‌ మాఫియా వెంటాడుతోంది. డ్రగ్స్ కేసులో మరో అరెస్టు జరిగింది. ప్రముఖ కన్నడ..

కొద్దిరోజులుగా శాండల్‌వుడ్‌ను డ్రగ్స్‌ మాఫియా వెంటాడుతోంది. డ్రగ్స్ కేసులో మరో అరెస్టు జరిగింది. ప్రముఖ కన్నడ నటి సంజన గల్రానీ నివాసంపై మంగళవారం ఉదయం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పోలీసు విభాగం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన తరువాత, డ్రగ్స్ కేసుకు సంబంధించి సిసిబి ఆమె ఇంటిపై దాడి చేసింది. అనంతరం ఆమెను సిసిబి విచారణ కోసం అదుపులోకి తీసుకుంది.

రాగిణి ద్వివేది తరువాత అరెస్టైన వారిలో సంజన రెండవ నటి. నటి సంజన.. రాహుల్ (ఈ కేసులో మరో నిందితుడు) తో చాలా సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. అతను సంజన గురించి సిసిబికి కొంత సమాచారం ఇవ్వడంతోనే ఆమెను విచారించారు. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags

Next Story