Sathyaraj: ఆయనపై అభిమానంతోనే పాత్ర నచ్చకపోయినా సినిమా ఒప్పుకున్నా: సత్యరాజ్

Sathyaraj: ఆయనపై అభిమానంతోనే పాత్ర నచ్చకపోయినా సినిమా ఒప్పుకున్నా: సత్యరాజ్
Sathyaraj: ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సత్యరాజ్.. తనకు నచ్చకపోయినా ఓ పాత్ర చేశానన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టారు.

Sathyaraj: ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా.. ఏదో ఒక్క పాత్రతోనే వారికి ఒక రేంజ్‌లో పాపులారిటీ లభిస్తుంది. అలా సీనియర్ నటుడు సత్యరాజ్‌కు 'కట్టప్ప' పాత్రతో పాపులారిటీ దక్కింది. మొదటి పాన్ ఇండియా చిత్రమైన బాహుబలిలో సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్ర చాలా కీలకం. అయితే ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సత్యరాజ్.. తనకు నచ్చకపోయినా ఓ పాత్ర చేశానన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టారు.

సౌత్ భాషల్లోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాల్లో కనిపించారు సత్యరాజ్. అందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' కూడా ఒకటి. 2013లో విడుదలయిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్'.. హిందీ సినిమాలను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కేవలం హిందీలోనే కాదు సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ దీపికా పదుకొనె తండ్రి పాత్రలో కనిపించారు సత్యరాజ్.

చెన్నై ఎక్స్‌ప్రెస్ స్టోరీతో దర్శకుడు రోహిత్ శెట్టి.. సత్యరాజ్‌ను సంప్రదించినప్పుడు తనకు ఆ పాత్ర ఏ మాత్రం నచ్చలేదట. ఇదే విషయాన్ని హీరో, డైరెక్టర్‌కు కూడా చెప్పాడట సత్యరాజ్. కానీ షారుఖ్ మీద అభిమానంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అంతే కాకుండా తన మీద అభిమానంతోనే దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రం ఎన్నోసార్లు చూశానని తెలిపాడు సత్యరాజ్.

Tags

Read MoreRead Less
Next Story