సమస్తం

Vijayakanth: సీనియర్ నటుడికి ఆపరేషన్.. కాలివేళ్లు తొలగింపు..

Vijayakanth: తమిళ సీనియర్ నటుడు, DMDK పార్టీ అధినేత విజయ్ కాంత్ కాలివేళ్లను వైద్యులు తొలగించారు.

Vijayakanth: సీనియర్ నటుడికి ఆపరేషన్.. కాలివేళ్లు తొలగింపు..
X

Vijayakanth: తమిళ సీనియర్ నటుడు, DMDK పార్టీ అధినేత విజయ్ కాంత్ కాలివేళ్లను వైద్యులు తొలగించారు. ఆయన కొంత కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదు. దీంతో అవి గాంగ్రీన్‌ అయ్యే ప్రమాదం ఉండడంతో.. మూడు వేళ్లను వైద్యులు తొలగించినట్టు DMDK పార్టీ తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని పేర్కొంది.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలను కోరింది. కెప్టెన్ విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ''నా ప్రియ మిత్రుడు విజయ్ కాంత్ త్వరగా కోలుకుని గతంలో లాగానే కెప్టెన్‌లా గర్జించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను'' అని రజినీకాంత్ తెలిపారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES