25 July 2022 4:55 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Shruti Haasan: ఒక్క...

Shruti Haasan: ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తానని అనుకోలేదు: శృతి హాసన్

Shruti Haasan: కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతి హాసన్.

Shruti Haasan: ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తానని అనుకోలేదు: శృతి హాసన్
X

Shruti Haasan: లోకనాయకుడిగా పేరు తెచ్చుకొని తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఓ ఐడల్‌గా మారారు కమల్ హాసన్. అలాంటి కమల్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతి. ముందుగా హిందీలో హీరోయిన్‌గా పరిచయమయ్యి ఆ తర్వాత సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం హీరోయిన్‌గానే కాదు.. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా చాలా విభాగాల్లో తన సత్తా చాటిన శృతి.. ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు కావడంతో సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.


'మ్యాజికల్‌గా 13 ఏళ్లు. నేను ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తానని అనుకోలేదు. నేను దీనికోసం పుట్టకపోయినా.. దీనిని ప్రేమించడం మొదలుపెట్టాను. నా జీవితంలోని చాలావరకు సంతోషం దీని వల్లే పొందుతున్నాను. నిజానికి నేను ఎప్పటికి రుణపడే జీవితాన్ని ఇది నాకు ఇచ్చింది. ఇన్నేళ్లుగా నేను ఎన్నో నేర్చుకున్నాను. గెలుపు, ఓటమిలను ఎలా తీసుకోవాలి, ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకెళ్లాలి, కథలను చెప్తున్న వారిని ఎలా అభినందించాలి, ఎప్పుడూ కలవని మనుషులతో ఎలా మెలగాలి.'

'నేను పొందుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ దీనిని తేలికగా తీసుకోను. నేను మీకు దీనికంటే ఎక్కువే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ 13 ఏళ్లకు చాలా థాంక్స్' అంటూ శృతి హాసన్ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం తను బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్‌లాంటి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.


Next Story