Sonu Sood : ట్రైన్ లో ఫుట్ బోర్డింగ్... డిపార్ట్మెంట్ వార్నింగ్
mumbai

సినిమాలు అందించిన పాపులారిటీ కన్నా, దానధర్మాలతోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న సోనూ సూద్ పై ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్స్ గానీ, ట్రోల్స్ గానీ రాలేదు. అతను సృష్టించుకున్న ఇమేజ్ అలాంటిది మరి. కానీ, ఒక్క వీడియోతో సీన్ మొత్తం మారిపోయింది. సోనూకు ఇది తగదు అంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఈ మధ్య రైలు ప్రయాణం చేస్తూ సోనూ చేసిన ఓ వీడియోనే ఈ దుమారానికి తెరలేపింది. రైలు ద్వారం వద్ద కూర్చుని తల బయటపెట్టి చూస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న సోనూ, ఇదే వీడియోనూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు కథ.
రైలులో ఫుట్ బోర్డింగ్ ప్రయాణం అంత్యంత ప్రమాదకరమని, సోనూ ఇలాంటి చర్యలను ప్రేరేపించకూడదంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఉత్తరాది రైల్వేశాఖ సైతం ఈ వీడియోపై నిప్పులు చెరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచే సోనూ, రైలులో ఇలా ప్రయాణించడం ప్రమాదకరమని, ఇలాంటి చర్యలు అభిమానులకు తప్పుడు సందేశాలను ఇస్తుందని ట్విట్టర్ లో పేర్కొంది. దయచేసి ఇలాంటివి చేయవద్దని విన్నవించుకుంటూనే సురక్షితంగా వెళ్లిరండి అంటూ ట్వీట్ చేసింది.
ఇక ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ సైతం ఇది అత్యంత ప్రమాదకరమైనదని నిజజీవితంలో ఇలాంటివి చేయకూడదని సోనూ సూద్ ను హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com