Sonu Sood: సోనూ మండి ప్లేట్... ఎంత పెద్దది అంటే...!

Sonu Sood: సోనూ మండి ప్లేట్... ఎంత పెద్దది అంటే...!
అతిపెద్ద మండి ప్లేట్ ను లాంచ్ చేయనున్ సోనూ సూద్; హీరో పేరిటే ప్లేట్ ను లాంచ్ చేస్తున్న గిస్మత్ జైల్ మండి

సోనూ సూద్ పేరు వింటే చాలు యువతలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఏ సెలబ్రిటీకి లేని ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు సోనూ మాత్రమే అందుకుంటున్నారు అనడంలో సందేహమే లేదు. కోవిడ్ సమయంలో సోనూ చేసిన సేవలు, దినసరి కూలీలను ఆదుకున్న వైనమే ఇందుకు కారణం అని ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఇక ఆ తరువాత కూడా సోనూ తాను చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఏదోక విధంగా ఇతరులకు సహాయం అందించేందుకే పెద్ద పీట వేయడం చూస్తూనే ఉన్నాం. యువతలో ఈ హీరోకు భారీ ఫాలోయింగ్ ఏర్పడటానికి ఇదే కారణం అని చెప్పవచ్చు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఓ భారీ మండీ ప్లేట్ ను లాంచ్ చేయబోతున్నారు సోనూసూద్. గిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ ఈ భారీ మండీ ప్లేట్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. విశేషమేమిటంటే సోనూ సూద్ పేరిటే ఈ మండి ప్లేట్ ను లాంచ్ చేయబోతున్నారట. శనివారం కొండాపూర్ లో ఈ ప్లేట్ లాంచింగ్ కార్యక్రమానికి స్వయంగా సోనూ హాజరవ్వబోతున్నారు. ఈమేరకు సోనూ కూడా ఓ వీడియో విడుదల చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద మండీ ప్లేట్ అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మరి ఆ ముచ్చటేంటో చూడాలంటే... గిస్మత్ జైల్ మండీకి వెళ్లిరావాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story