Sonu Sood: బీహారీ గాయకుడిని వైరల్ చేసిన సోనూ...

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే కాదు, అత్యుత్తమ ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలోనూ సోనూ సూద్ ఓ అడుగు ముందే ఉంటాడు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది ఈ బీహారీ బాబు కథ. బీహార్ కు చెందిన ఈ కుర్రాడు పాటలు పాడుతూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తాజాగా మస్తీ సినిమాలోని దిల్ దే దియా హై పాటను హృద్యంగా ఆలపించాడు. అతడి గానం, గాత్రం, ఉచ్ఛారణ అన్నీ అద్భుతంగా ఉన్నాయి అనడంలో సందేహమే లేదు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. అలా సోనూ కంట్లోనూ పడ్డాడు. ఈ కుర్రాడి టాలెంట్ కు ఫిదా అయిన సోనూ సైతం తన అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఒక్క బీహారీ వంద మందికి సరిసమానమని ట్యాగ్ కూడా చేశాడు. దీంతో అబ్బాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు అనడంలో సందేహమేలేదు. ఇక సోనూ పోస్ట్ కు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ అబ్బాయి బీహార్ ఇండియన్ ఐడల్ అంటూ కొంత మంది కామెంట్ చేయగా, అతడికి ఏదోక సహాయం చేయాలని మరికొంద మంది విన్నవించుకుంటున్నారు. అయితే, ఈ ఒక్క పోస్ట్ చాలూ అబ్బాయి ఎక్కడికో వెళ్లిపోతాడు అంటూ నెటిజెన్లు సోనూను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com