Sudeep: 'మీడియా మిత్రులకు క్షమాపణలు': సుదీప్

Sudeep: మీడియా మిత్రులకు క్షమాపణలు: సుదీప్
Sudeep: శాండిల్‌వుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ‘ఈగ’తో తెలుగువారికి విలన్‌గా పరిచయమయ్యాడు సుదీప్.

Sudeep: ఇప్పటిరోజుల్లో ఓ సినిమా ప్రేక్షకులు చూసేలా చేయాలంటే ప్రమోషన్స్ చాలా కీలకం. అందుకే ఏ బడ్జెట్ సినిమా అయినా ప్రమోషన్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు మేకర్స్. అలాగే తను నటించిన అప్‌కమింగ్ మూవీ 'విక్రాంత్ రోణ' ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో సుదీప్. ఇలాంటి సమయంలో తాను మీడియా వారికి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.

శాండిల్‌వుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ'తో తెలుగువారికి విలన్‌గా పరిచయమయ్యాడు సుదీప్. ఆ తర్వాత తను హీరోగా నటించిన కన్నడ సినిమాలు కూడా తెలుగులో డబ్ అవ్వడం మొదలయ్యింది. ఇక తన కెరీర్‌లో సుదీప్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణ. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

జులై 28న విక్రాంత్ రోణ దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతూ ఉండాలి. ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సుదీప్. 'ప్రెస్ మీట్, ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు చెన్నై, హైదరాబాద్, కొచ్చిలోని మీడియా మిత్రులందరికీ సారీ. నా ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు నాకు పర్వాలేదు. అందుకే త్వరలోనే మళ్లీ ప్రయాణాన్ని మొదలుపెడతాను. మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను.' అని ట్వీట్ చేశాడు సుదీప్.


Tags

Read MoreRead Less
Next Story