Kamal Haasan: 'విక్రమ్' మూవీ సూపర్ హిట్.. కమల్‌ను హత్తుకొని నటి ఎమోషనల్..
Kamal Haasan: సినీ పరిశ్రమలో లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్.. సినీ కెరీర్ గత కొంతకాలంగా అంత సాఫీగా సాగడం లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకున్నా.. కమర్షియల్ సినిమాల్లో నటించినా.. ఏది తనకు ఆశించనంత సక్సెస్ ఇవ్వలేకపోయింది. కానీ 'విక్రమ్' చిత్రం మాత్రం కమల్‌కు తాను కోరుకున్న హిట్‌ను అందించింది. దీంతో ఓ నటి.. కమల్ హాసన్‌ను హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యింది.
లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన 'విక్రమ్' సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అంతే కాకుండా కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోంది. దీంతో కమల్ ఆనందానికి అవధులు లేవు. అందుకే మూవీ టీమ్ అందరికీ తనకు తోచిన గిఫ్ట్స్ ఇస్తూ వారిని అభినందిస్తున్నాడు. అయితే ఈ సక్సెస్ కమల్‌కు మాత్రమే కాదు.. తన సక్సెస్‌ను చూడాలనుకున్న వారికి కూడా ముఖ్యమే.
సీనియర్ నటి సుహాసిని.. కమల్ విక్రమ్ సినిమా సక్సెస్‌ను చూసి ఎంతో మురిసిపోతున్నారు. అందుకే తన చిన్నాన్న కోసం స్పెషల్‌గా ఓ పోస్ట్ చేశారు. 'సంతోషానికి మాటలు, భాష అవసరం లేదు. నేను ఆయనకు హలో అని చెప్పను. నా ప్రేమను చూపిస్తాను. నా చిన్నాన్ని కోసం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రపంచమంతా దీనికి సంతోషిస్తోంది' అని పోస్ట్ చేసింది సుహాసిని. విక్రమ్ సక్సెస్ వారందరికీ ఎంత స్పెషల్ అని ఈ పోస్ట్ ద్వారా మరోసారి బయటపడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com