అంగరంగ వైభవంగా సుమలత కుమారుడి పెళ్లి
దివంగత నటుడు అంబరీష్.. హీరోయిన్ సుమలతల కుమారుడు అభిషేక్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అవివా బిడప్పా తో అభిషేక్ వివాహం జరిగింది. అవివా బిడప్పా తండ్రి ప్రసాద్ బిడప్పా ఇండియన్,తల్లి జుదిత్ బిడప్పా ఇంగ్లాండ్ కి చెందిన వారు.ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎంపీలు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వ్యాపారవేత్త అయిన అవివా బిడప్పా గత కొంతకాలంగా అభిషేక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కూడా పెద్దల అంగీకారంతో పెళ్లిని చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులతో మాట్లాడి వీరు పెళ్లి పీటలెక్కారు. ఇటీవలే వీరి వివాహ నిశ్చితార్థం కూడా చాలా ఘనంగా జరిగింది. ప్రస్తుతం సుమలత మాండ్య నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com