Sunny Leone: షూటింగ్ లో గాయపడిన సన్నీ

కుర్రకారు కలలరాణి సన్నీ లియోన్ గాయాలపాలైంది. షూటింగ్ సమయంలో ఆమె కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా వెల్లడైంది. సోఫాలో కూర్చుని ఉన్న సన్నీ కాలి వేలికి గాయమై రక్త స్రావం అవుతుండగా ఆమె సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ కోసం హడావిడి పడుతున్నట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. అయితే ఈ దెబ్బ ఎలా తగిలింది అన్న సంగతి చెప్పలేదు. కొటేషన్ గ్యాంగ్ అనే తమిళ సినిమా సెట్స్ పైనే ఈ ఘటన చోటుచేసుకుందని హ్యాష్ ట్యాగ్ ద్వారా అర్ధమవుతోంది. ఏమైనా సన్ని పోస్ట్ మాత్రం వైరల్ గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి సన్ని త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొటేషన్ గ్యాంగ్ లో సన్నీతో పాటూ ప్రియమణి, జాకీ ష్రాఫ్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే సినిమా టీజర్ కూడా విడుదలైంది. హార్డ్ కోర్ క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ సినిమాలో సన్నీ మునుపెన్నుడూ కనిపించని అవతారంలో కనువిందు చేయబోతోంది. టోటల్ డీ గ్లామరైజ్డ్ లుక్ లో దర్శనమివ్వబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com