Suriya: మల్టీ స్టారర్‌లో అన్నదమ్ములు.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్‌లో..

Suriya: మల్టీ స్టారర్‌లో అన్నదమ్ములు.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్‌లో..
Suriya: ఒక్కొక్క సినిమాను ఒక్కొక్క జోనర్‌లో చేస్తూ.. ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంటాడు కార్తి.

Suriya: మల్టీ స్టారర్ సినిమాలంటే అప్పటికీ, ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ ఎక్కువే. అందుకే ఇద్దరు హీరోల కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని అందరూ ఎదురుచూస్తుంటారు. తాజాగా కోలీవుడ్‌లో అలాంటి ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ఇది ఇద్దరు అన్నదమ్ములు కలిసి నటించనున్న మల్టీ స్టారర్ అని సమాచారం.

కోలీవుడ్‌లో హీరో కార్తీకి ఉండే ఫ్యాన్ బేస్ మామూలుది కాదు. ఒక్కొక్క సినిమాను ఒక్కొక్క జోనర్‌లో చేస్తూ.. ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంటాడు కార్తి. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కూడా.. తన అన్నతో సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు కార్తీ. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇన్నాళ్లకు తన అన్నతో కలిసి మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ వచ్చింది కార్తీకి.

కార్తి నటించిన అన్ని సినిమాలు మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'ఖైదీ'. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ.. సూపర్ హిట్ అయ్యింది. అందుకే లోకేశ్‌తోనే ఖైదీ 2ను ప్లాన్ చేశాడు కార్తీ. అయితే ఈ సినిమాలో సూర్య కూడా నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎప్పటినుండో ఈ ఇద్దరు హీరోల అభిమానులు మల్టీ స్టారర్ కోసం ఎదురుచూస్తుండగా.. అది లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో అని తెలియడంతో వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story