Suriya: 'విక్రమ్' సినిమాకు ప్రాణం పోసిన సూర్య.. కమల్ స్పెషల్ గిఫ్ట్..

Suriya: తమిళ దర్శకులలో లోకేశ్ కనకరాజ్‌కు ఓ స్పెషల్ మార్క్ ఉంది. రొటీన్ కథలను ఎంచుకోడు, అలా అని కమర్షియాలిటీని మిస్ అవ్వడు. అయినా లోకేశ్ చేసిన ప్రతీ సినిమా హిట్ అవ్వా్ల్సిందే. అందుకే కొద్ది సినిమాల అనుభవంతోనే కమల్ లాంటి స్టా్ర్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు కమల్. విడుదలయిన రోజు మార్నింగ్ షో నుండే విక్రమ్‌కు పాజిటివ్ టాక్ రావడంతో.. మూవీ కలెక్షన్ల విషయంలో కూడా దూసుకుపోతోంది.
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి పెద్ద హీరోలను క్యాస్ట్ చేయడంతోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు లోకేశ్. అంతే కాకుండా సూర్య గెస్ట్ రోల్ అని కూడా సినిమా విడుదల ముందే చెప్పేశాడు. కానీ ప్రేక్షకులు ఊహించిన దానికంటే సూర్య రోల్ సినిమాకు మరింత ప్రాణం పోసింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ కూడా ఇటీవల ఒప్పుకున్నారు.
రెండేళ్ల గ్యాప్ తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్.. బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టాడు. అందుకే సంతోషంతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతే కాకుండా లోకేశ్ టీమ్‌లోని 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైకులను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక తాజాగా విక్రమ్‌లో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించినందుకు సూర్యకు రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ఫోటోలను సూర్య స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com