16 Feb 2023 9:41 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Suriya Meets Sachin:...

Suriya Meets Sachin: అపూర్వ కలయిక

ముంబైకు చక్కర్లు కొడుతున్న సూర్య; మాస్టర్ బ్లాస్టర్ ను కలసిన సూర్య; వీరి కలయిక వెనుక ఆంతర్యంమేమిటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కుతూహలం

Suriya Meets Sachin: అపూర్వ కలయిక
X

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ఈ మధ్య ముంబైకి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, ధనుష్ దారిలో మనోడు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నాడేమోనని అంతా భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు సూర్య మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ను కలవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇటీవలే ముంబైకి వెళ్లిన సూర్య సచిన్ ను కలసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కలయికకు కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు. ఈ ఫోటోను సూర్యనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసి లవ్, రెస్పెక్ట్ సచిన్ అని టాగ్ చేశాడు. సూర్య ఫ్యాన్స్ ఈ ఫొటోను చూసి తెగ మురిసిపోతున్నారు. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో నటిస్తున్న సూర్య వెయ్యేళ్ల నాటి పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దిషా పటానీ సూర్యకు జోడీగా నటించబోతోంది. ఈ సినిమా తరువాత వెట్రి మారన్ దర్శకత్వంలో వాడి వాసల్ అనే చిత్రంలో నటించనున్నాడు సూర్య.

Next Story