Suriya: సెన్సేషనల్ హిట్ 'గజిని'లో సూర్యకంటే ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..?

Suriya: సెన్సేషనల్ హిట్ గజినిలో సూర్యకంటే ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..?
Suriya: ఒక హీరో కోసం రాసిన కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం, ఆ హీరో కథను ఓకే చేయడం లాంటివి చాలా కామన్‌గా జరుగుతుంటాయి.

Suriya: ఒక హీరో కోసం రాసిన కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం, ఆ హీరో కథను ఓకే చేయడం లాంటివి చాలా కామన్‌గా జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఓ హీరో వదులుకున్న సినిమా సూపర్ సక్సెస్ కూడా అవ్వొచ్చు. అలా ఓ స్టార్ హీరో 'గజిని' కథను రిజెక్ట్ చేయడంతో సూర్య.. ఆ సినిమాలో నటించి సెన్సేషన్ క్రియట్ చేశాడు. కానీ ముందుగా సూర్య స్థానంలో దర్శకుడు మురుగదాస్.. వేరే హీరోను క్యాస్ట్ చేయాలి అనుకున్నారట.

మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గజిని' చిత్రం కోలీవుడ్‌లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమానే ఏరికోరి అమీర్ ఖాన్ హిందీలో రీమేక్ చేయించుకున్నాడు. హిందీలో తెరకెక్కిన గజిని.. ఇండియాలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమాగా రికార్డ్ సాధించింది. కానీ ఎంతైనా తాను సూర్యలాగా నటించలేకపోయానని అమీర్ ఖాన్ ఓపెన్‌గా చెప్పేశాడు.


అయితే ముందుగా గజిని సినిమా కథను మాధవన్‌కు వినిపించాడట మురుగదాస్. కానీ మాధవన్‌కు కథ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో.. ఇదే విషయాన్ని మురుగదాస్‌కు చెప్పి సినిమాను రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని మాధవన్ స్వయంగా బయటపెట్టాడు. ఇటీవల రాకెట్రీ మూవీ సక్సెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న సూర్య, మాధవన్.. ఒకరి వర్క్ గురించి మరొకరు ప్రశంసించుకున్నారు.


గజిని కథ సరైన నటుడి చేతికే వెళ్లిందని మాధవన్ అన్నాడు. అంతే కాకుండా 'ఖాకా ఖాకా' చిత్రంలో సూర్య నటన తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. సూర్య.. ఓ సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడని ప్రశంసించాడు మాధవన్. పైగా గజిని సినిమాలో సూర్య చేసినట్టుగా సిక్స్ ప్యాక్ తాను చేయలేకపోయేవాడని అన్నాడు. ప్రస్తుతం సూర్య.. విక్రమ్ చిత్రంతో, మాధవన్.. రాకెట్రీ చిత్రంతో మంచి హిట్స్ అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story