T Rajendar: కొడుకు గురించి చెప్తూ నటుడు ఎమోషనల్.. తనకోసమే అంతా అంటూ..

T Rajendar: కొడుకు గురించి చెప్తూ నటుడు ఎమోషనల్.. తనకోసమే అంతా అంటూ..
T Rajendar: వైద్యుల సూచనల మేరకు అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు రాజేందర్.

T Rajendar: కోలీవుడ్ యంగ్ హీరో శింబు తండ్రి టి రాజేందర్ గత కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇన్నాళ్లు కోలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేశారు రాజేందర్. ఆయన ఇటీవల కడుపునొప్పితో చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చేరారు. అయితే అక్కడి వైద్యుల సూచనల మేరకు అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఎయిర్‌పోర్టులో ఆయన ఆరోగ్యం గురించి ప్రశ్నించడానికి వెళ్లిన మీడియా ముందు రాజేందర్ భావోద్వేగానికి లోనయ్యారు.

శింబు ప్రస్తుతం కోలీవుడ్‌లోని బిజీ హీరోల్లో ఒకరు. కానీ తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ముందుగా తను అమెరికా వెళ్లి తండ్రి వైద్యం కోసం కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటున్నాడు. దీనికోసం షూటింగ్స్ అన్నింటిని వాయిదా వేసుకున్నాడు. ఇదే విషయాన్ని మీడియాతో చెప్తూ ఎమోషనల్ అయ్యారు శింబు తండ్రి రాజేందర్.

శింబు కోసమే తాను విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పారు రాజేందర్. గత కొన్నిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి తన వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని అన్నారు. శింబు గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి మనసున్న కొడుకన్నారు. ఇంతటి ప్రేమను చూపించే కొడుకుని కన్నందుకు నాకెంతో గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యారు రాజేందర్.

Tags

Read MoreRead Less
Next Story