వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త.. మీ ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా..!

కరోనా సెకండ్ వేవ్‌ను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. థర్డ్‌వేవ్‌ని ఎదురుకునేందుకు సిద్దంగా ఉండాలి కూడా.. అసలే వర్షాకాలం కూడా మొదలైంది.. వాతావరణంలో కూడా చాలా మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఈ టైంలో మురుగునీటికి దూరంగా, అపరిశుభ్రమైన ప్రదేశాలకి దూరంగా ఉండాలి. బయట కాకుండా ఇంట్లో ఫుడ్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లోనే తయారుచేసిన వేడివేడి ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. దీCoronaనివలన ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా పనిచేస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో వీటిని తినడం వలన సీజనల్ వ్యాధులతో పోరాడవచ్చు. కరోనా లాంటి మహమ్మారితో పోరాడంలో విటమిన్ సీ ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తూ కవచంలో ఉపయోగపడుతుంది. ఇక పసుపుని కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆహారంలో పాటు, పాలలో పసుపు కలుపుకొని తాగడం మంచిది.
అటు ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మనం తినే ఆహారంలో ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. హెర్బల్ టీ లేదా కషాయాలను క్రమం తప్పకుండా తాగాలి. వర్షాకాలంలో నీటిని శుద్ధి చేసుకుని లేదా వేడి చేసుకుని తాగడం మంచిది. శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు మొటిమలను తగ్గించుకోవడంలో నీరు సహాయపడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com