Tamanna Vijay Varma: తెలిసినా... తెలియనట్టే....!

మిల్క్‌బ్యూటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో ఇద్దరి కిస్సింగ్ వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి అభిమానులు, నెటిజన్ల చూపంతా వారి పైనే ఉండి పోయింది.
తాజాగా ఈ జంట ముంబైలో జరిగిన అవార్డు షో కు జంటగా హాజరయ్యారు. ఈ కార్యకార్యక్రమంలో వారిద్దరూ చాలా సాన్నిహిత్యంగా ఉండటం చూసి ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వారిద్దరూ కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఫోటొకు ఫోజులివ్వడం, వాటేసుకొవడం చూసి మురిసిపోతున్నారు.
తమన్నా,విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే వారి బంధం గట్టిగానే ఉందని తెలుస్తుంది. వారి వీడియో చూసిన ఓ నెటిజన్ "గ్రేట్ కపుల్" అని కామెంట్ చేయగా మరోకరు "దే మేక్ ఎ నైస్ కపుల్" అంటూ రాసేస్తున్నారు. తమన్నా,విజయ్ తన రిలేషన్ షిప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకుపోవడానికి రెడీగా లేరు, కానీ ఇద్దరూ ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తున్నట్లు వారి కలయిక చెప్పకనే చెబుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com