Tamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్‌తో పాటు..

Tamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్‌తో పాటు..
Tamannaah: తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా జైలర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.

Tamannaah: సూపర్ స్టార్ రజినీకాంత్.. కేవలం సీనియర్ దర్శకులకే కాదు.. యంగ్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇస్తూ షాకిస్తున్నారు. చివరిగా యాక్షన్ డైరెక్టర్ శివతో కలిసి 'పెద్దన్న' చిత్రం చేశారు రజినీ. కానీ ఆ సినిమా రొటీన్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో రజినీ కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత నెల్సన్ దిలీప్ కుమార్‌పైనే ఉంది.

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ వచ్చిన 'బీస్ట్' చిత్రం పాపులర్ అయినా కూడా మిక్స్‌డ్ టాక్‌ను మాత్రమే సంపాదించుకోగలిగింది. కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నా.. చాలామంది మాత్రం బాలేదు అని ఓపెన్‌గా చెప్పేశారు. దాంతో రజినీతో నెల్సన్ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఇటీవల వీరిద్దరు కలిసి చేస్తున్న మూవీ 'జైలర్' అని టైటిల్ అనౌన్స్ చేసేసరికి ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది.

జైలర్‌లో ఇప్పటికే రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది తమిళ హీరోల సరసన నటించిన తమన్నా.. రజినీతో నటించే ఛాన్స్ మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక 'జైలర్'తో ఆ కోరిక తీరనుంది. దీనిపై మూవీ టీమ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.



Tags

Read MoreRead Less
Next Story