The Summer I Turned Pretty Season 2 : ఒక వేసవి మాయాజాలం

The Summer I Turned Pretty Season 2 : ఒక వేసవి మాయాజాలం
అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్

ఒక పదహారేళ్ళ అమ్మాయి అందగా మారుతునాన్నని భావించే వేసవి ఇది. ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ.. బాహ్య సౌందర్యం, అంతః సౌందర్యం గురించి తెలియని వయసు, శరీరం లో వచ్చే మార్పు వంటి అంశాలతో పాటు తొలి ప్రేమ మధురనుభూతిని తెలిపిన ట్రాయాంగిల్ లవ్ స్టోరీ. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి విరహాలతో ఒక సంపూర్ణ వేసవి మాయాజాలం.

చికాకు కలిగించే పాత్రలు, విసుగేత్తించే నటన, రొటీన్ కథలతో అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు ఈ సిరీస్ కాస్త ప్రశాంతత ఇస్తుంది. సౌండ్‌ట్రాక్, అద్భుతమైన లొకేషన్‌లు, రంగురంగుల కాస్ట్యూమ్‌లు, అద్భుతమైన కాస్టింగ్, మంచి స్క్రిప్ట్ పటిష్టమైన ప్రదర్శనలు ఈ సిరీస్‌ని చాలా వినోదాత్మకంగా చేశాయి. జెన్నీ హాన్ రచించిన ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ పుస్తకం ఆధారంగా తీసిన ఈ వెబ్ సీరిస్ అందరినీ ఆకట్టుకుంటోందనే చెప్పచ్చు. ఇందులో మెయిన్ రోల్ చేసిన బెల్లీ (లోలా తుంగ్) ప్రతి వేసవిలో కజిన్స్ బీచ్ వద్ద సముద్రతీరానికి వస్తూ ఉంటుంది. ఆమె తన సోదరుడు స్టీవెన్ (సీన్ కౌఫ్‌మాన్), తల్లి లారెల్ (జాకీ చుంగ్)తో తన రెలెటివ్ సుసన్నా (రాచెల్ బ్లాన్‌చార్డ్) ఇంటికి చేరుకుంటుంది. సుసన్నా బెల్లి తల్లికి చాలా దగ్గరైన స్నేహితురాలు కూడా..సుసన్న కు చెందిన ఒక అందమైన, ఒక మాన్షన్ లాంటి బీచ్ హౌస్కి వీరంతా వచ్చినప్పుడు జరిగిన కధే ఇది.


సుసన్నా కుమారులు, కాన్రాడ్ (క్రిస్టోఫర్ బ్రినీ), జెరెమియా (గావిన్ కాసాలెగ్నో) లతో బెల్లీ స్నేహం, చిగురించిన ప్రేమ మొదటి సీజన్ అయితే సమ్మర్ పూర్తి అయ్యి తరువాత ఏడాది సమ్మర్ కి వచ్చేటప్పటికి వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులే ఈ ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ సీజన్ 2 లో చూపించబడింది.. ఇంతకీ బెల్లీ తన ఇద్దరు కజిన్స్ లో ఎవరిని ఇష్టపడుతోంది.. ఆ విషయం వారికి చెప్పిందా అన్న అంశం తో పాటు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు, శారీరిక సమస్యలు, మానసిక ఆందోళనలు అన్నిటినీ ఈ సీజన్ మీ కళ్ళముందుకు తీసుకొస్తుంది.. మరెందుకు ఆలస్యం..బెల్లీ జీవితంలో ఏం జరగబోతోందో అమెజాన్ ప్రైంలో చూసేయండి మరి.

Tags

Next Story