Tollywood: ఆసక్తి రేకెత్తిస్తోన్న `ఏటీఎం'...

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కలిసి ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. డైరక్టర్ హరీష్ శంకర్ రాసిన కథతో ఈ 'ఏటీఎం' వెబ్‌సీరీస్ తెరకెక్కింది. బిగ్‌బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ కూడా ఈ సీరీస్‌తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. 'ఏటీఎం' ట్రైలర్‌ని ఇవాళ దర్శకుడు హరీష్ శంకర్ ఆవిష్కరించారు.
సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సీరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. డీజే, గబ్బర్‌సింగ్ చిత్రాల ఫేమ్ హరీష్‌శంకర్ స్టార్ షో రన్నర్. ఇక ఈ సిరీస్‌లో వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ కీలక పాత్రలు పోషించారు. టీజర్‌ను ఆవిష్కరించిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. దోపిడీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ అని, ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఉత్కంఠకు గురిచేసే స్టోరీ అని, తమ కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి జీ5లో ప్రసారమవుతుందని చిత్ర బృందం తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com